
నా ప్రయాణం & ఆలోచన
ఆత్మీయులకు నమస్కారం! నా పేరు నంద్యాల సుబ్బారావు. ‘మోక్షం’ అనేది కేవలం ఫోటో ఫ్రేమ్‌ల వ్యాపారం కాదు; ఇది అంతఃచేతనలో నుండి పుట్టిన ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. అరుణాచల క్షేత్రమన్నా, భగవాన్ రమణ మహర్షి బోధనలన్నా అపారమైన భక్తి, శ్రద్ధ.
నేను ఇప్పటివరకు అరుణాచలంలో సుమారు 50కి పైగా గిరి ప్రదక్షిణలు చేసిన క్రమంలో, ఆ గిరి సాన్నిధ్యంలో లభించిన అపారమైన ప్రశాంతత ఈ ఆలోచనకు పునాది వేసింది.
ప్రతి గిరి ప్రదక్షిణలో అడుగు ముందుకు వేస్తున్నప్పుడు కలిగిన ఏకైక ఆలోచన: “ఈ దివ్య ప్రశాంతత కేవలం అరుణాచలంలోనే కాకుండా, ప్రతి ఒక్కరి ఇంట్లో, వారి కళ్ల ముందే ఎందుకు ఉండకూడదు?” అని
నా సంకల్పం:
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు అందరినీ చుట్టుముడుతున్నాయి. అలాంటి సమయంలో మీ వర్క్ డెస్క్ పైనో, స్టడీ టేబుల్ పైనో, లేదా పూజా గదిలోనో భగవాన్ రమణ మహర్షి ప్రశాంత వదనంతో కూడిన రూపం, మహర్షుల అమూల్యమైన సూక్తులు కనిపిస్తే… ఆ ఒక్క క్షణం.. మనస్సులోని ఆందోళనలన్నీ కరిగిపోయి అద్భుతమైన ప్రశాంతత చేకూరుతుంది.
భగవాన్ రమణ మహర్షి బోధించిన నిశ్శబ్దం, ఆత్మవిచారణ (“నేనెవరు?”) సందేశం ప్రతి ఇంటి గడపను తాకాలన్నదే మోక్షం యొక్క సంకల్పం.

